కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 8వ తేదీన విశాఖకు రానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనను వాయిదా వేసుకొన్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా ఇప్పుడు రాలేకపోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలకు ఆయన సమాచారం ఇచ్చారు. అయితే ఈ నెల 11వ తేదీన విశాఖకు వస్తున్నట్లు చెప్పారు. అమిత్ షా భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.