ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకొని మల్లాయపాలెం టిడ్కో గృహాల సముదాయం వద్ద ఏర్పాట్లను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మంగళవారం పరిశీలించారు. ఈనెల తొమ్మిదో తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి గుడివాడ రూరల్ మండలం మల్లాయపాలెం వద్ద టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సందర్భంగా జరుగుతున్న ఏర్పాటు గురించి చర్చించడానికి ఈరోజు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజబాబు, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఎమ్మెల్సీ మరియు ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం లతో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఏర్పాట్లు గురించి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మరియు జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.