నేడు సీఎం జగన్ ఆధ్వర్యంలో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో అమలు చేయాల్సిన పథకాలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే 12వ పీఆర్సీ, ఓపీఎస్ స్థానంలో సరికొత్త ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికలు దగ్గరికొస్తున్నందున ఉద్యోగుల్లో అసంతృప్తిని చల్లార్చేలా నిర్ణయాలు ఉంటాయని సమాచారం. ఖరీఫ్ సీజన్ లో విత్తనాలు, ఎరువుల సరఫరాపై సైతం సమీక్షించనున్నారు.