ఇటీవల ఎంపీడీవోలుగా ఉద్యోగోన్నతి పొందినవారికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోస్టింగులు కేటాయిస్తూ గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెన్నీ క్రిస్టినా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు యు. బి. వరప్రసాద్ (మాచవరం), బి. శ్రీనివాసరావు (వేమూరు), జి. శేషగిరిరావు (వట్టిచెరుకూరు), ఎన్. వెంకటేశ్వర్లు (నరసరావుపేట), కె. శివపార్వతి (రేపల్లె) మండలాలకు ఎంపీడీవోలుగా పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.