పనికిమాలిన వ్యక్తులతో ప్రెస్మీట్లు పెట్టించి వైయస్ఆర్ సీపీ ప్రభుత్వాన్ని తిట్టిస్తే టీడీపీకి రోజుకో 10 వేల ఓట్లు తగ్గడం తప్ప మరే ఉపయోగం ఉండదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి అన్నారు. దిక్కుమాలిన వ్యక్తులతో ప్రభుత్వాన్ని తిట్టిస్తూ చంద్రబాబు శునకానందం పొందుతున్నాడని మండిపడ్డారు. యువగందరగోళంతో నారా లోకేష్ రాష్ట్రమంతా తిరుగుతూ ప్రగల్భాలు పలుకుతున్నాడని, అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తాడో చెప్పకుండా.. వైయస్ఆర్ సీపీ నేతల అంతు చూస్తాం, వెంటాడుతాం, వేధిస్తామని మాట్లాడుతున్నాడంటే.. తెలుగుదేశం పార్టీ దివాళాకోరు పార్టీగా తయారైందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదన్నారు.