రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉండగా చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసినా చెప్పుకోవడానికి ఒక్క మంచి పథకం కూడా లేదన్నారు. 2014 మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చిన తరువాత మూలన పడేసిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు.