భార్య గొంతు నులిమి చంపిన ఘటన సత్తెనపల్లి పట్టణంలోని రంగా కాలనీలో జరిగింది. భీమవరం గ్రామానికి చెందిన కార్తీక్, అరుణకు మూడేళ్ల క్రితం వివాహం అయింది. కుటుంబ కలహాల నేపథ్యంలో కార్తీక్ మంగళవారం అర్ధరాత్రి సమయంలో భార్య గొంతు నులిమి చంపాడు. అనంతరం కార్తీక్ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.