భర్త మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యపై అత్యాయత్నానికి పాల్పడిన సంఘటన రాజుపాలెం మండలంలోని కొండమోడు శివారు టీఎన్ నగర్ లో జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం మాచర్ల మండలం పాలవాయి చెందిన దూదేకుల ఆషాకు 15 సంవత్స రాల క్రితం డివిటి వివాహం జరిగింది. తన భర్త అన్వర్బషా మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆషాను వేధిస్తున్నాడు.
ఈ నెల 3వ తేది ఉదయం అన్వర్ బాషా తన కుటుంబసభ్యులతో కలిసి ఆమెపై హత్యయత్నం చేశారు. గమనించిన కాలనీవాసులు ఆషాను రక్షించి పిడుగురాళ్ల వైద్యశాలకు తరలించారు. బుధవారం పెద్ద సంఖ్యలో మహిళలు వెళ్లి రాజుపాలెం పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్థానిక ఎస్ఐ నారాయణను వివరణ కోరగా పోలీస్ స్టేషన్ కు వచ్చిన వారు ఆషాకు విషప్రయోగం జరిందని చెప్పారని, అయితే హస్పిటల్ నుంచి నివేదిక వచ్చిన తర్వాత కేసు నమోదు చేస్తామని అన్నారు.