నరసన్నపేట పట్టణం పల్లిపేట జంక్షన్ వద్దనున్న నీలకంఠశ్వేర స్వామి ఆలయం సమీపంలోనే బార్ అండ్ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. రోడ్డు ఇవతల శివాలయం ఉంటే అవతల బార్ ఉంది. మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేయాల్సిన బార్‌ను పంచాయతీలో అనుమతులు ఇవ్వడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, రాష్ట్రంలోని ఏడు ప్రాంతాల్లో బార్లను షిఫ్ట్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఇందులో భాగంగా ఇచ్ఛాపురం నుంచి నరసన్నపేటకు షిప్టింగ్ చేశామని ఎక్సైజ్ సీఐ రమణమూర్తి తెలిపారు.