జూన్ 12 నుంచి ఏపీలో పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం ప్రకటించారు.ఈ నేపథ్యంలో ఆ రోజు పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం జగన్, జగనన్న విద్యార్థులకు విద్యా కానుక కిట్లను అందజేయనున్నారు. ఒక్కో విద్యార్థికి దాదాపు రూ.2,500 విలువ చేసే కిట్ అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. జగనన్న విద్యా కానుకకు రూ.1100 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.