నిషేధం ఉన్నప్పటికీ తిరుమలలో మళ్లీ విమానాలు సంచరించాయి. గురువారం ఉదయం 7.45, 8.00, 8.22 గంటలకు మూడు విమానాలు శ్రీవారి ఆలయ గగనతలం నుంచి వెళ్లాయి. శ్రీవారి ఆలయ గగనతలం నుంచి విమానాలు వెళ్లడం నెల రోజుల వ్యవధిలో ఇది మూడోసారి. ఆగమశాస్త్రాల ప్రకారం తిరుమల ఆలయంపై నుంచి విమానాలు వెళ్లడం నిషిద్ధం. విమానాల రాకకు అడ్డుకట్ట వేసేలా శ్రీవారి ఆలయ గగనతలాన్ని ‘నో ఫ్లై జోన్’గా ప్రకటించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.