తెలుగు రాష్ట్రాల్లో మాంస ప్రియులకు చికెన్ ధరలు షాకిస్తున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే చికెన్ ధరలు రెట్టింపు అయ్యాయి. ఏప్రిల్ 1న కేజీ చికెన్ ధర సుమారు రూ.150 ఉంటే.. ప్రస్తుతం రూ.300 దాటింది. మార్కెట్లో స్కిన్‌తో కూడిన చికెన్ ధర కిలో రూ.275 ఉండగా.. స్కిన్ లెస్ చికెన్ ధర రూ. 310కి చేరింది. ఏప్రిల్ 1న రూ.84 ఉన్న ఫారం కోడి ధర ప్రస్తుతం రూ.150 వరకు చేరింది.