సీఎం జగన్కు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ రాశారు. జూన్ 12 నుంచి స్కూళ్లు ప్రారంభించాలన్న నిర్ణయంపై.. ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. అధిక ఉష్ణోగ్రత వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్లకు విద్యార్థులు హాజరైతే.. పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఎండ వేడి తట్టుకోలేక వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే.. ఏసీ రూముల్లో నుంచి బయటకు రావడం లేదన్నారు. అలాంటిది చిన్నపిల్లలు స్కూళ్లకు ఎలా వస్తారు? అని అనగాని ప్రశ్నించారు.