అన్ని గ్రామాలలో నిర్మిస్తున్న గృహ నిర్మాణాలు పూర్తి చేయించాలని గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి. శ్రీనివాస్ ఆదేశించారు. శుక్రవారం బొండపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో కన్వర్జెన్సీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిల్లులు ప్రభుత్వం తొందరగా చెల్లిస్తున్న కారణంగా లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మండల ప్రత్యేక అధికారి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎంపీపీ చల్లంనాయుడు ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, తహసిల్దార్ ప్రసాదరావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.