పూతలపట్టు నియోజకవర్గ ఇన్చార్జి పదవిని ఎట్టకేలకు టీడీపీ అధిష్టానం భర్తీ చేసింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు పూతలపట్టు మండలం గొడుగుచింత గ్రామానికి చెందిన మురళిని నియమి స్తున్నట్లు మాజీ మంత్రి అమరనాథరెడ్డి, పూతలపట్టు నియోజకవర్గ పరిశీలకుడు బొమ్మన శ్రీధర్ తెలిపారు. శుక్రవారం నియోజకవరంలోని ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు. మురార్జీ యాదవ్, ఎన్పీ జయప్రకాష్, గిరిధర్ బాబు, దిలీప్ కుమార్, దొరబాబు చౌదరి, ఇతర సీనియర్ నేతలతో చర్చించి నియోజకవర్గ ఇన్చార్జిగా మురళిని నియమించారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి మురళిని గెలిపించాలని అధినేత సూచించారు. మురళి ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా ఒక టీవీ చానల్ రిపోర్టరుగా పనిచేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa