గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో రెండోరోజు గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి శనివారం నాడు పాల్గొన్నారు. ఇంటింటి కెళ్ళి లబ్ధిదారుల్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. మన ప్రభుత్వం సంక్షేమాల ప్రభుత్వం అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.