జులై 1వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో భక్తుల ఆరోగ్యం దృష్ట్యా తీసుకోవాల్సిన ఆహారంపై దేవస్థానం పలు సూచనలు చేసింది. ‘ఈట్ రైట్’ పేరుతో స్వీకరించాల్సిన, నిషేధించిన ఆహార పదార్థాల జాబితాను తెచ్చింది. మాంసాహారం, మత్తు పదార్థాలు, గుట్కా, పాన్ మసాలా, సిగరెట్లు వంటివాటిపై నిషేధం ఉంది. పూరీలు, సెనగల కూర, పిజ్జా, బర్గర్లు, దోసెలు, హల్వా, రసగుల్లా, పకోడీ లాంటివి తినకూడదు.