గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కమలాపురం నియోజకవర్గం వీరపునాయినిపల్లె మండలంలోని తంగడుపల్లెలో ప్రజలతో కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం నిర్వహించిన గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ ఫలాలను వివరించారు. అలాగే ప్రజల నుంచి సమస్యలను తెలుసుకొని స్థానిక అధికారులకు పరిష్కరించాలని ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు.