పొట్టిగా ఉండడం వల్లే పెళ్లి కావడంలేదనే బెంగతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఝార్ఖండ్ లోని రాంచీలో జరిగింది. పుండగ్ పోలీస్ స్టేషన్ పరధిలో శ్వేత(22) అనే యువతికి మూడు పెళ్లి సంబంధాలు వచ్చి, వెనక్కి వెళ్లాయి. దీంతో, తాను పొట్టిగా ఉండడం వల్లే సంబంధాలు క్యాన్సిల్ అయ్యాయని ఆమె తీవ్రమనస్థాపానికి గురైంది. గురువారం రోజు కుటుంబ సభ్యులు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది.