పొన్నూరు మండలంలోని మునిపల్లె గ్రామంలో రేపు ఆదివారం తెలుగుదేశం రాష్ట్ర నాయకుడు , మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం జరుగునని పొన్నూరు తెదేపా కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాల మీద నిరసన, పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులు వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు గ్రామంలోని ఇంటింటికీ ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. కావున నియోజకవర్గంలో నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, తెదేపా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్ని జయప్రదం చేయాలని వారు కోరారు.