కుటుంబ కలహాలతో ఓ యువకుడు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన శుక్రవారం రాత్రి బి. కొత్తకోటలో జరిగింది. పోలీసుల కథనం మేరకు. కొత్తకోటలో కాపురం ఉండే ఆదం బాషా ఎలక్ట్రికల్ పనిచేసి భార్య పిల్లల్ని పోషిస్తాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో గొడవపడి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వైద్య చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది.