ఒంటరి జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి విషంతాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో జరిగింది. పోలీసులు మరియు స్థానికుల కథనం మేరకు పుదిపట్ల గ్రామం, మిట్టూరుకు చెందిన రామన్న, రత్నమ్మల కొడుకు విజయగోపాల్ (27) టెంపో డ్రైవర్ గా పనిచేస్తాడు. తల్లిదండ్రులు బెంగళూరులో ఉండడంతో ఒంటరి జీవితం కొనసాగిస్తున్నాడు. దీనితో జీవితంపై విరక్తితో శుక్రవారం రాత్రి విషం తాగాడు. మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో చేర్చగా మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.