వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ బిల్లును అడ్డుకునే ప్రయత్నంలో జపాన్ పార్లమెంట్లో తాజాగా గొడవ జరిగింది. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ ఫర్ ది పీపుల్, నిప్పాన్ ఇషిన్ నో కై అనే పార్టీలు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశాయి. కానిస్టిట్యూషనల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్, జపాన్ కమ్యూనిస్ట్ పార్టీ చట్టాన్ని వ్యతిరేకించాయి. ఈ క్రమంలో ఎంపీలు ఘర్షణ పడ్డారు. ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు.