ఏపీ ఎన్నికలపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీలోనూ ఎన్నికలకు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. సీఎం జగన్ ఆగస్టులో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. జేపీ నడ్డా వ్యాఖ్యల ప్రకారం ప్రభుత్వానికి అప్పు పుట్టే పరిస్థితి లేదని, అప్పు పుట్టకపోతే జగన్ ప్రభుత్వాన్ని ఒక్కరోజు కూడా నడపలేడని, అందుకే ముందస్తుకు వెళ్తారని అన్నారు.