పేద విద్యార్థి చదువుకు ఇండియన్ స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఆర్థిక సాయం చేశాడు. కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లి పరిధిలోని మహాలింగపురకు చెందిన అమృత్ మావినకట్టి అనే విద్యార్థి పీయూసీలో 600కు 571 మార్కులు సాధించాడు. పై చదవులకు డబ్బులు లేకపోవడంతో దాతల కోసం ఎదురుచూస్తున్నాడు. విషయం తెలుసుకున్న నితిన్ అనే వ్యక్తి అమృత్‌ను ఓ ప్రైవేట్ కాలేజీలో బీకాంతోపాటు సీఏ కోర్సులో చేర్పించాడు. ఏడాదికి రూ.85 వేలు ఫీజు చెల్లించాలి. నితిన్ కూడా తన ఫ్రెండ్స్‌కి ఈ విషయాన్ని తెలిపాడు. అలా స్నేహితుల ద్వారా తెలుసుకున్న కేఎల్ రాహుల్ విద్యార్థి చదువుకు అవసరమైన డబ్బును అందించాడు.