మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి బాధాకరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దయాకర్ రెడ్డి మృతి బాధాకరమన్నారు. పార్టీకీ ఆయన చేసిన సేవలు ఎనలేనివన్నారు. 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ప్రజలకు విశేష సేవలందించారన్నారు. దయాకర్ రెడ్డి తెలంగాణ ఉద్యమం సమయంలోనూ సీమాంధ్రులతో తోడ బుట్టిన సోదరుడిలా వ్యహరించారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు.