ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా భారీ సంఖ్యలో టీచర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 56,829 మంది టీచర్లను బదిలీ చేస్తూ ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. 56,829 మంది సెకండ్ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు బదిలీ అయ్యారు. మెరిట్, సీనియారిటీ ఆధారంగా బదిలీలు చేసినట్లు ఏపీ విద్యాశాఖ మంగళవారం ప్రకటించింది. దీనికి సంబంధించి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి ఆన్లైన్ విధానంలో బదిలీల ప్రక్రియ చేపట్టామని వివరించారు.