మతతత్వ వైఖరితో వైసీపీ వుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ మోసాలను తాము ఎప్పటికప్పడు వ్యతిరేకించమని, ఏనాడు సమర్థించలేదని అన్నారు. ఏపీలో జరుగుతున్న అన్ని విషయాలు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామన్నారు. బీజేపీ ఏనాడు జగన్‌తో లేదని స్పష్టం చేశారు. కాగా పవన్ బీజేపీతోనే కలిసి ఉన్నారని.. పవన్‌పై వ్యాఖ్యలు చేయొద్దని ముఖ్యమంత్రికి ఘాటుగా చెప్తున్నామన్నారు. ఏపీలో బిజెపిని పలచన చేయడానికి జగన్ వ్యూహాత్మకంగా అమలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.