కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పేవరకూ ఎంపీ జీవీఎల్‌కు రాష్ట్రంలో అవినీతి గురించి తెలియదా? అని విద్యా శాఖామంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఇంతకాలం జీవీఎల్ ఎందుకు ప్రశ్నించలేదో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను అమిత్ షా, జీవీఎల్ మాట్లాడారని అర్ధమవుతోందన్నారు. గురివింద గింజల్లా తమ కింద మచ్చను బీజేపీ నేతలు చూసుకోవాలని బొత్స సూచించారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీ పరిస్థితి ఏంటో బీజేపీ నేతలు పరిశీలించుకోవాలన్నారు. ప్రధానితో తమ బంధం ఎలా ఉందో అమిత్ షాతోనూ అలానే ఉందన్నారు. ఒకరితో ఎక్కువ, మరొకరితో తక్కువ లేవన్నారు.