పల్నాడు జిల్లా, క్రోసూరులో ఇటీవల సీఎం జగన్ పర్యటించిన విషయం తెలిసిందే. అక్కడి ఓ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు విద్యాకానుక కిట్లను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి పలువురు టీచర్లు సైతం హాజరయ్యారు. వారిలో ఒకరైన పద్మావతి అనే ఉపాధ్యాయురాలు నేడు అకస్మాత్తుగా మరణించారు. క్రోసూరులో సీఎం జగన్ సభకు టీచర్ పద్మావతి హాజరయ్యారు. అమరావతి మండలం లింగాపురం హైస్కూల్లో హిందీ టీచర్‌గా పద్మావతి పని చేస్తున్నారు. క్రోసూరు సభ నుంచి తిరిగి వచ్చిన కొద్ది సేపటికే ఆమె వడదెబ్బ తగలడంతో అస్వస్థతకు గురయ్యారు. ఇక నేడు స్కూల్లో విద్యా కానుక కిట్లు పంపిణీ చేస్తుండగా పద్మావతి కుప్పకూలారు. తోటి ఉపాధ్యాయులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పద్మావతి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.