తమిళనాడు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. సీఎం స్టాలిన్ కేబినెట్ మంత్రి వి.సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేయడంతో తమిళనాడులో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ క్రమంలో సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీబీఐని తమిళనాడులోకి అనుమతించమన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థకు ఇచ్చే సాధారణ సమ్మతిని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa