బిపర్జాయ్ తుఫాన్ ప్రభావంతో గుజరాత్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఈ తుఫాను తీరాన్ని తాకనుంది. ఈ మేరకు అప్రమత్తమైన అధికారులు 70 గ్రామాలకు చెందిన 75 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే త్రివిధ దళాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. అలాగే డామన్‌లోని బీచ్‌లలో 144 సెక్షన్ విధించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈనెల 16న రాజస్థాన్‌పై తుఫాన్ ప్రభావం చూపనుందని ఐఎమ్‌డీ వెల్లడించింది.