పశ్చిమ బెంగాల్లోని రెండు జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వారిపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలయ్యాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భంగాల్లో ఇద్దరు, ఉత్తర దినాజ్పూర్ జిల్లాలో ఒకరు కాల్పుల్లో మరణించారు. నామినేషన్ల దాఖలు చివరి రోజే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. తమ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి వెళ్తున్నప్పుడే తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు హింసకు దిగారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.