నగరం మండలం పెద్దపల్లి పంచాయతీ పరిధిలోని గట్టువారిపాలెం గ్రామంలో ఎన్ ఆర్ జి ఎస్ పథకం ద్వారా నిర్మిస్తున్న రహదారికి నగరం ఎంపీపీ చింతల శ్రీకృష్ణయ్య శుక్రవారం శంకుస్థాపన చేశారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలలో అంతర్గత రహదారులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ శాఖ అధికారులు, ఎన్ ఆర్ జి ఎస్ సిబ్బంది, వైసిపి నాయకులు పాల్గొన్నారు.