నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వరం వద్ద గల పర్యాటక శాఖ రెస్టారెంట్ ను లీజు కు ఇచ్చుటకు పర్యాటక శాఖ కార్యాలయము, నంద్యాల నందు జరిగిన బహిరంగ వేలంపాటలో అధిక వేలం పాట పాడి దక్కించుచుకున్న సింగారం వెంకటరమణ పుష్పగుచ్చముతో జిల్లా కలెక్టర్ ను శుక్రవారం కలిశారు. మొదటి సంవత్సరం అడ్వాన్స్ లీజు అమౌంట్ రూ. 2, 57, 240 డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో నంద్యాల జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్, జిల్లా పర్యాటక మండలి నంద్యాల కార్యాలయంలో అందజేశారు. జిల్లా పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ అధికారి సి హెచ్ ఎస్ సత్యనారాయణ తెలిపినారు.