టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా లోకేష్ పాదయాత్రలో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదని, యువగళానికి స్పందనే లేదని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఏ పంట ఎక్కడ పండుతుందో కనీస పరిజ్ఞానం లేని లోకేష్ కూడా వ్యవసాయం గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుందన్నారు. టీడీపీ హయాంలో సాగు, తాగునీరు లేదని, చంద్రబాబు అధికారంలోకి ఉంటే కరువు కటకాలు విలయతాండవం చేస్తాయన్నారు. బాబు హయాంలో ప్రతి ఏటా కరువు మండలాలు ప్రకటించారని గుర్తుచేశారు.