ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 57 లక్షల విలువైన విదేశీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ ఫైజిల్ అనే వ్యక్తి నుంచి సీఐఎస్ఎఫ్ దళాలు యూఏఈకి చెందిన దిర్హమ్ కరెన్సీని సీజ్ చేశారు. సుమారు 2,85,500 దిర్హమ్లను పట్టుకున్నారు. ఆ కరెన్సీ విలువ 57 లక్షలు ఉంటుందని ఫైజిల్ దుబాయ్‌కు వెళ్తున్నట్లు గురించారు. అంత భారీ మొత్తం కరెన్సీ తీసుకువెళ్తున్న అతను దానికి సంబంధించిన డాక్యుమెంట్లను చూపించలేకపోయాడని అధికారులు తెలిపారు.