ఆత్మకూరు పట్టణంలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరున ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం, ఎంజీఆర్ ఫౌండేషన్ సొంత నిధులతో నిర్మించిన ఎంజీఆర్ మున్సిపల్ బస్టాండ్ ప్రారంభోత్సవం ఈనెల 23వ తేదీ జరుగుతుందని ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు శనివారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి విచ్చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.