‘‘జగన ఒక విఫలమైన ముఖ్యమంత్రి. చంద్రబాబు నిర్మించిన సచివాలయంలో కూర్చొని పాలన చేయడం కూడా చేతగాని ఈ ముఖ్యమంత్రి మూడు రాజధానులు నిర్మిస్తాడా!?’’ అని నారా లోకేష్ ప్రశ్నించారు. కట్టింగ్.. ఫిట్టింగ్ మాస్టర్ జగన్కు కన్నింగ్ (మోసం)చేయడం తప్ప పాలన చేయడం చేతకాదన్నారు. జగన, ఆ పార్టీ నాయకులు కాలుమోపిన కారణంగా ప్రశాంతంగా ఉన్న విశాఖ అశాంతితో నిండిపోయిందన్నారు. వైసీపీ ఎంపీ సత్యనారాయణ భార్య, కొడుకును కిడ్నాప్ చేసినా అడ్డుకునే దిక్కులేకుండా పోయిందన్నారు. అసలు ఈ కిడ్నాప్ ఎందుకు జరిగిందని ఆరా తీస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. వైసీపీ నాయకుల భూదందాల్లో వాటాలు పంచుకోవడంలో తేడాలవల్లే ఇది జరిగిందని, ఈ కిడ్నాప్ వెనుక జగన బంధువులు ఉన్నారని తెలిసిందని చెప్పారు.