ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిడ్నప్ బ్యాచ్ కి వైసీపీ నాయకులకి సంభంధం ఉంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 17, 2023, 04:39 PM

‘‘విశాఖ నగరంలో అక్రమార్జన, కబ్జాల కోసం వైసీపీ నేతలు పెంచి పోషించిన ముఠాలే అక్కడ కిడ్నాపులకు పాల్పడ్డాయి. లూఠీ చేసిన సొమ్ము పంపకాల్లో వచ్చిన తేడాలతోనే వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ జరిగింది. దాన్ని కప్పిపుచ్చడానికి పోలీసులు నానా తంటాలు పడుతున్నారు’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘విజయసాయిరెడ్డి, ఉత్తరాంధ్ర మంత్రులు పెంచి పోషించిన విష నాగులే సొంత పార్టీ వారిని కాటేయడానికి ప్రయత్నించాయి. విజయసాయికి, విశాఖ ఎంపీ సత్యనారాయణకు భూముల ఆక్రమణలో తేడాలు వచ్చాయి. వారిద్దరికీ చెడింది. విజయసాయిరెడ్డి తర్వాత ఉత్తరాంధ్రకు ఇన్‌చార్జిగా వచ్చిన వైవీ సుబ్బారెడ్డి వారిద్దరూ కొట్టేసిన భూముల్లో వాటా అడగడం... స్ధానిక మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వాటాల కోసం ఒత్తిడి చేయడం ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్‌ చేసేవరకూ వెళ్లింది. విశాఖ నగర ప్రజలు సీఎం జగన్‌ అక్కడకు మకాం మారుస్తున్నారంటే హడలిపోతున్నారు’’ అని బొండా అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com