జన సేనా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర సందర్భంగా కాకినాడలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ద్వారంపూడిలో ముఖ్యమంత్రి అండ చూసుకుని అక్రమ దందా చేస్తున్నారని మండిపడ్డారు. ద్వారంపూడి ముఖ్యమంత్రి అండ చూసుకుని అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నాడని మండిపడ్డారు. ద్వారంపూడి... గుర్తుపెట్టుకో..నీ పతనం మొదలైంది. మీ సామ్రాజ్యాన్ని కూలదోయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు.... నా పార్టీ జనసేన కాదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. మారేందుకు ఓ చాన్స్ ఇస్తున్నా... మారకపోతే ఎస్పీ టీటీ నాయక్ మీ తాతకు బేడీలు వేసి లాక్కెళ్లినట్టు నీక్కూడా భీమ్లానాయక్ సినిమా చూపిస్తా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.