ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటిపూట తరగతులను ఈ నెల 24 వరకు పొడిగిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 7.30 నుంచి 11.30 వరకు తరగతులు నిర్వహించాలని, 11.30 నుంచి 12.00 గంటల మధ్య మధ్యాహ్న భోజనం పెట్టి పంపించేయాలని సూచించింది.