ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రికెట్ ఆడుతూ లాయర్ మృతి

national |  Suryaa Desk  | Published : Mon, Jun 19, 2023, 11:17 AM

క్రికెట్ ఆడుతూ ఓ యువ న్యాయవాది మృతిచెందిన ఘటన విశాఖపట్నంలో జరిగింది. జగదాంబకూడలికి చెందిన మణికంఠనాయుడు (26) అంతర జిల్లాల న్యాయవాదుల క్రికెట్‌ టోర్నమెంట్‌ లో బి-టీం తరఫున ఆడుతున్నాడు. ఆదివారం గాజువాక జింక్‌ మైదానంలో మ్యాచ్ ఆడిన తర్వాత బయటకు వస్తూ కుప్పకూలాడు. సహచరులు 108కు సమాచారం ఇవ్వడంతో, వారు వచ్చి చూడగా అప్పటికే మృతిచెందాడు. మణికంఠనాయుడికి గుండె వ్యాధి ఉందని, ఈ కారణంతోనే మృతి చెందాడని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa