ప్రేమజంటను యువతి కుటుంబ సభ్యులు దారుణంగా హత్యచేసిన ఘటన మధ్యప్రదేశ్ లోని మొరేనా జిల్లాలో జరిగింది. శివాని(18), రాధేశ్యామ్(21) అనే యువతీయువకులు ప్రేమించుకోగా, వారి ప్రేమను యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఈనెల 3 నుండి ప్రేమికులిద్దరూ కనిపించకుండా పోవడంతో యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసు విచారణలో యువతి కుటుంబ సభ్యులే వారిని కాల్చి చంపి, శవాలను చంబల్ నదిలో పడేశారని తేలింది.