ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్ర మంగళవారం జరగనుంది. ఉదయం 9 గంటల్లోపు జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాలను రథాలపై ప్రతిష్టించి తర్వాత మంగళ హారతి చేపడతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్ దేవ్ రథాలపై చెరాపహర (బంగారు చీపురుతో ఊడ్చడం) చేస్తారు. 3 గంటలకు భక్తులు రథాలను లాగుతారు. ఈసారి 10 లక్షల మంది వస్తారన్న అంచనాతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa