తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ ఇటీవల క్యాష్ ఫర్ జాబ్స్ స్కామ్లో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను ఆరోగ్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లగా ఆయన గుండెలో పలు చోట్ల బ్లాక్స్ ఉన్నట్లు తెలిసింది. దీంతో జూన్ 21వ తేదీన ఆయనకు సర్జరీ చేయనున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న కావేరీ ప్రైవేటు ఆస్పత్రిలోనే ఆయనకి సర్జరీ చేయనున్నారు.