బిహార్‌లోని కటిహార్ జిల్లాలో మరో రైలు ప్రమాదం తప్పింది. గుహవాటి నుండి జమ్మూకు వెళ్తున్న లోహిత్ ఎక్స్‌ప్రెస్ నార్త్ దినాజ్‌పుర్ జిల్లాలో ఉన్న దల్ఖోలా స్టేషను సమీపంలో ఒక్కసారిగా రెండు భాగాలుగా విడిపోయింది. ఇంజిను నుండి 10 బోగీలు విడిపోగా, మిగిలిన రైలు అలాగే కొద్దిదూరం పరుగులు తీసింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలను కాసేపు నిలిపివేసి, రెండు భాగాలను జతచేశాక రైలు మళ్లీ కదిలింది.