తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టి కొనసాగిస్తున్న పాదయాత్రలో రైల్వే కోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కస్తూరి విశ్వనాథ నాయుడు పాల్గొన్నారు. బుధవారం తిరుపతి జిల్లా రాపూరు నుండి వెంకటగిరి కి వెళ్లే మార్గంలో జరిగిన పాదయాత్రలో లోకేష్ బాబుతో కలిసి కస్తూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వే కోడూరు నియోజకవర్గం రాజకీయాలపై లోకేష్ బాబుతో మాట్లాడారు. ప్రజలు నారా లోకేష్ బాబు పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని, 2024వ సంవత్సరంలో జరిగే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని ఆయన అన్నారు.