వైసీపీ అమలు చేస్తోంది నకిలీ రత్నాలని కాంగ్రెస్ మీడియా రాష్ట్ర ఛైర్మన ఎన. తులసిరెడ్డి ఎద్దేవచేశారు. కాంగ్రెస్ ఆరు అంశాలతో తయారు చేసిన మేనిఫెస్టోతో అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరుతుందని బుధవారం అనంతపురం లోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అన్నారు. రూ.6 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ, రూ.500కు వంట గ్యాస్ తదితర వాటితో అనేక మంది లబ్ధిపొందుతారన్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తేస్తే అన్ని వర్గాలకూ సమన్యాయం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ, సెల్ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్, జిల్లా అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు వాసు, రామానాయుడు, నాయకులు శర్మాస్, నిశాంతరెడ్డి, పరమేశ్వరరెడ్డి పాల్గొన్నారు.