శ్రీకాకుళం జిల్లా, మెళియాపుట్టి, పెద్దపద్మాపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు గొట్టిపల్లి నారాయణమ్మ మెడ నుంచి బంగారు పుస్తెలతాడు చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే..... బుధవారం నారాయణమ్మ బందపల్లిలో ఉన్న తన చెల్లెలి ఇంటికి వెళ్లి తిరిగి ప్రైవేట్ బస్సులో పెద్దపద్మాపురం జంక్షన్ దిగింది. ఓ ఆటోలో గ్రామానికి వెళ్తుండగా ఆ ఆటో డ్రైవర్ మార్గమద్యలో ఆపి ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు పుస్తెల తాడును తెంపుకుని టెక్కలి వైపు పరార య్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రాజేష్ తెలిపారు.